నాలుగు బూత్‌లలో రీపోలింగ్‌కు పిటిషన్
సత్తెనపల్లి, మహానాడు: నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. నియోజకవర్గంలోని 236, 237, 253, 254 బూత్‌లలో రీ పోలింగ్ నిర్వహించాలని పిటిషన్లో కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు మరో ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది.