ఎన్ టి పి సి – హిందూజా పవర్ ప్లాంట్ లను సందర్శించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్

పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ లో ఉన్న ఎన్ టి పి సి మరియు హిందూజా పవర్ ప్లాంట్ లను అనకాపల్లి ఎంపీ మరియు పెందుర్తి ఎమ్మెల్యే సందర్శించి యాజమాన్యంతో చర్చలు జరిపారు. స్థానికంగా ఉన్న పలు సమస్యల గురించి సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం, ఎం.పీ సీ.ఎం రమేష్ మాట్లాడుతూ..

పవర్ ప్లాంట్ల నుండి వచ్చే యాష్ పాండ్, దుమ్ము దూళి నుండి స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు.

పాలవలస, దేవాడ, నమ్మి దొడ్డి, తదితర గ్రామాల ప్రజల నుండి వినతులు స్వీకరించి హిందూజా లోని స్థానిక యువతకు ఉపాధి వచ్చేలా యాజమాన్యం తో మరోసారి చర్చలు జరుపుతాం అన్నారు. పరిసర గ్రామాల ప్రజలకు వ్యాధులు రాకుండా భద్రత చర్యలు తీసుకోవాలని యాజమాన్యలకు తెలియజేసాం అన్నారు.

హిందూజా కి రైల్వే లైన్ లేకపోవడం పలు ఇబ్బందులు ఉన్నాయి అని యాజమాన్యం వారు తెలియజేశారు. రైల్వే లైన్ వస్తే స్థానికంగ పొల్యూషన్ తగ్గుతుందని అందుకు గాను కేంద్రం తో చర్చిస్తామన్నారు. ఫార్మా మరియు పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు వారం రోజులపాటు అన్ని కంపెనీలకు స్వయంగా స్థానిక ప్రజా ప్రతినిధులుతో వెళ్లి పరిశీలిస్తాం అన్నారు. పర్యటనలో స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.