అనంత బాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి

– మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్

గుంటూరు, మహానాడు: వైసీపీ కార్యకర్తలకు ఎమ్మెల్సీ అనంత బాబు, మాజీ ఎంపీతో కలిసి దళితులను ఎలా చంపాలి, మహిళలను ఎలా వేధించాలి అని శిక్షణ ఇప్పిస్తారని, ఇప్పటికే అనంత బాబు సమాజంలో అప్రతిష్ఠ పాలయ్యారని తక్షణం ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడటాన్ని సమాజంలోని అన్ని వర్గాలు ఖండించాయి. అనంత బాబు వంటి వారిపై చర్యలు తీసుకోవాలని త్వరలోనే గవర్నర్ కలుస్తాం. అనంత్ బాబు, తోట త్రిమూర్తులపై చర్యలు తీసుకోవాలని, అహంకారాన్ని వైసీపీ నేతలు వదులుకోవాలని ఆయన హితవు పలికారు.