అనంతపురం, మహానాడు : అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరి స్తున్నారని, వైసీపీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారని టీడీపీ నాయకులు ఇటీవల ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. ఎన్నికల విధులు అప్పగించొద్దని ప్రభుత్వానికి సూచించింది. ఆయన స్థానంలో ప్రత్యామ్నాయంగా నియామకానికి పలువురి పేర్లను సిఫారసు చేస్తూ ప్రతిపాదనలు పంపాలని కోరింది.