Mahanaadu-Logo-PNG-Large

అరాచకపాలన అంతమే కూటమి లక్ష్యం

మరోసారి జగన్‌కు ఓటేస్తే సర్వనాశనమే
మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌
ఐదేళ్ల పాలనపై చార్జిషీట్‌ బుక్‌ విడుదల

జగ్గయ్యపేట, మహానాడు : జగ్గయ్యపేట టీడీపీ కార్యాలయంలో శనివారం ఐదేళ్ల జగన్‌ పాలనలో అరాచకాలు, అవినీతి పై ఎన్డీఏ చార్జిషీట్‌ బుక్‌ను ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌, ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రపుల్ల శ్రీకాంత్‌ విడుదల చేశారు. నెట్టెం రఘురామ్‌ మాట్లాడుతూ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన తర్వాత జగన్‌ 2024 ఎన్నికలలో మరొక్క ఛాన్స్‌ అనే మాట వింటుంటే ప్రజల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. ఐదేళ్ల జగన్‌ పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబడిరదన్నారు. నమ్మి ఒకసారి వైసీపీకి ఓటేస్తే రాష్ట్రం మూడు దశాబ్దాలు అభివృద్ధిలో వెనక్కిపోయిందని, మరోసారి ఓటేస్తే రాష్ట్రం పరిస్థితి ఏంటోనని భయపడుతున్నారని విమర్శించారు. రూ.13 లక్షల కోట్ల అప్పుల మూటను ప్రజల నెత్తిన గుదిబండలాగా తగిలించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికే దక్కుతుందన్నారు. ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ.10 లక్షల భారం మోపాడు.

అమ్మఒడికి రూ.10 వేలు ఇచ్చి నాన్న బుడ్డీలో రూ.లక్ష కొట్టేస్తున్నాడు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది పేదల్ని జబ్బులపాలు చేశాడు. అందులో 30 వేల మంది ప్రాణాలు తీశాడని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీల సబ్‌ ప్లాన్‌ నిధులు లక్ష కోట్లు దారి మళ్లించాడు. నవరత్నాలు నవమోసాలయ్యాయని ధ్వజమెత్తారు. పాదయాత్ర, మేనిఫెస్టో లో 730 హామీలిచ్చి అందులో 85 శాతం అమలు చేయలేదని, ఇప్పుడు 99 శాతం హామీలు అమలు చేశానని పదేపదే అబద్దాలు చెబుతూ మరోసారి మోసగిస్తున్నాడని మండిపడ్డారు.

అంధకారంలో రాష్ట్ర భవిష్యత్తు
జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఊసే లేకుండా పోయిందన్నారు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని కులాల కుంపట్లు, మత విధ్వేషాలు, ప్రాంతాల మధ్య చిచ్చు రేపారని విమర్శించారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కార్‌ హామీ మారిచి ఉద్యోగులను బానిసలుగా చూస్తున్నారు. 2019లో మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ అని చెప్పి అధికారంలోకి వచ్చిన అనంతరం పేదలకు బిస్కెట్‌ ఇచ్చి జగన్‌ మాత్రం ఇంట్లో బంగారు బిస్కెట్లు పేర్చుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చిన రుణాలు, ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు తడిసి మోపెడై రాష్ట్ర భవిష్యత్తు అంధకారం లో పడిరదని అన్నారు.

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను అటకెక్కించాడు…
ఎన్టీఆర్‌ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అన్నెపగా ప్రఫుల్ల శ్రీకాంత్‌ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ ఇస్తే జగన్‌ ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. విశ్వసఘాతుకానికి జగన్‌ ట్రేడ్‌ మార్క్‌ అని చెప్పడానికి వివేకా హత్య, హామీల అమలుపై మాట తప్పడమే నిదర్శనమన్నారు. అమరావతే రాజధాని అని మూడు ముక్కలాట ఆడి దేశ వ్యాప్తంగా నవ్వుల పాలయ్యాడన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నుంచి బీజేపీ కోర్‌ కమిటీ మెంబర్‌ కీసర రాంబాబు, జగ్గయ్యపేట నియోజకవర్గ కన్వీనర్‌ మన్నే శ్రీనివాసరావు కో కన్వీనర్‌ బొడ్డు మల్లికార్జునరావు, ఎన్టీఆర్‌ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కల్లూరి శ్రీవాణి, తెలుగు దేశం పార్టీ నుంచి రాష్ట్ర గ్రీవెన్స్‌సెల్‌ కో కన్వీనర్‌ ముల్లంగి రామకృష్ణారెడ్డి, నూజివీడు నియోజకవర్గ రాష్ట్ర పరిశీలకుడు గింజుపల్లి రమేష, ఎన్టీఆర్‌ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు తాళ్లూరు వెంకటేశ్వర్లు, షేక్‌ అన్వర్‌, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురా లు, కౌన్సిలర్‌ కన్నెబోయిన రామలక్ష్మి, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌ యానా ల గోపీచంద్‌, ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాడిశ మురళీకృష్ణ, కృష్ణాజిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్‌ జగ్గయ్యపేట మండల అధ్యక్షుడు తులసి బ్రహ్మ, పెనుగంచిప్రోలు మండల అధ్యక్షుడు తునికిపాటి శివవత్సవాయి, మండల అధ్యక్షుడు రేగండ్ల వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.