470 మందికి పైగా వైద్యపరీక్షలు
సేవలందించిన సూపర్‌స్పెషాలిటీ వైద్యులు
గుంటూరు, మహానాడు : గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని ఏటుకూరులో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వ ర్యంలో ప్రతి ఆదివారం ఆరోగ్య వారం కార్యక్రమంలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 11 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు వైద్యసేవలు అందించారు. సుమారు 470 మంది పాల్గొనగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ పేదలకు వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశంతో వైద్యులు సేవాభా వంతో ముందుకురావడం అభినందనీయమన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని వెల్లడిరచారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిరాల సీతా రామయ్య, కార్పొరేటర్ వాసు, నిశంకరరావు అమర్నాధ్, డాక్టర్లు అన్వేష్‌కు మార్, సాయి రాజశేఖర్, తేజస్వి, కుప్పు స్వామి, శిరీష, పవన్, మాధవిలత, గోపికృష్ణ, జూనియర్ డాక్టర్లు సోనియా, రీనా, దేదీప్య, తదితరులు పాల్గొన్నారు.