– టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్
కాకినాడ, మహానాడు: త్వరలో జగ్గంపేట, కిర్లంపూడిలో అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు కానున్నట్టు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ వెల్లడించారు. కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద సోమవారం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ లో పలువురికి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం పేదల నోటి వద్ద అన్నం లాగి అన్న క్యాంటీన్లు రద్దు చేసినందుకు నిరసనగా జగ్గంపేటలో 20 మాసాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ప్రభుత్వం జగ్గంపేట, కిర్లంపూడి లలో అన్నా క్యాంటీన్ సెకండ్ ఫేజ్ లో ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన కూడా చేశామని తెలిపారు. ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో కొనసాగుతుందన్నారు. ఈ వారం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి దివంగత ముసిరెడ్డి ఆంజనేయులు కుమారుడు, కాట్రావులపల్లి టీడీపీ అధ్యక్షుడు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆర్థిక సహాయంతో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముసిరెడ్డి నాగేశ్వరరావు సోదరుడు ఆదినారాయణ, శ్రీనివాస్, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, అడబాల వెంకటేశ్వరరావు, జాస్తి వసంత్, దేవరపల్లి మూర్తి, బచ్చల సుధీర్, వేములకొండ జోగారావు, దాపర్తి సీతారామయ్య, కోడూరి రమేష్, ఎండి కాజా, సాంబత్తుల చంద్రశేఖర్, ఏజ్రా శాస్త్రి, హరి గోపాల్, నాగిరెడ్డి అనిల్, ప్రేమ స్వరూప్ బుజ్జి, తుమ్మల కిషోర్, వాన శెట్టి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.