త్వరలో మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

– మంత్రి నారాయణ

తిరుపతి, మహానాడు: తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్, తుడా అధికారులతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేషన్, తుడా పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వచ్చే నెల 13 వ తేదీన మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం.. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అన్ని వ్యవస్థలు నాశనం… అన్ని శాఖల్లో నిధులను గత ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది… సీఎం చంద్రబాబుకు ఉన్న అనుభవంతో నిధులు సమీకరిస్తున్నారు… తుడా లో జీతాల కోసం గత ప్రభుత్వంలో భారీగా నిధులు ఖర్చు… వచ్చే నెలాఖరుకు టీడీఆర్ బాండ్ల సమస్య కొలిక్కి తెస్తాం… తిరుపతిలో టీడీఆర్ బాండ్ల స్కాంపై కమిటీ నియామకం చేస్తామని మంత్రి అన్నారు.