పిన్నెల్లి సోదరులపై మరో హత్యాయత్నం కేసు

సీఐ నారాయణస్వామి స్టేట్‌మెంట్‌ ఆధారంగా నమోదు
సిట్‌ రంగప్రవేశం తర్వాత మారిన పరిణామాలు

మాచర్ల, మహానాడు : మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్తలపై దాడి చేయబోయిన పిన్నెల్లి బ్రదర్స్‌, వారి అనుచరులను అడ్డుకున్న కారంపూడి సీఐ నారాయణస్వామిపై రాళ్ల దాడి జరిగింది. దాంతో తీవ్రంగా గాయపడిన సీఐ తొలుత 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్టు ఫిర్యాదు చేశారు. సిట్‌ రంగప్రవేశం తర్వాత సీఐ స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఐపీసీ 307 కింద పిన్నెల్లి సోదరులపై హత్యాయత్నం కేసు నమోదు నమోదు చేశారు. ఇప్పటికే పాల్వాయి గేట్‌ బూత్‌లో టీడీపీ ఏజెంట్‌ శేషగిరిరావుపై దాడి కేసులో పిన్నెల్లి సోదరులపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికీ వారు పరారీలోనే ఉన్నారు. వారి ఆచూకీపై ఇప్పటికీ పోలీసులు నోరు మెదప డం లేదు. ఈవీఎం ధ్వంసం కేసులో మాత్రమే పిన్నెల్లికి జూన్‌ 6 వరకు కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరుచేసింది. పిన్నెల్లి వ్యవహారంలో నివేదిక తెప్పించు కున్న కేంద్ర ఎన్నికల సంఘం అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది.