చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం!

అమరావతి, మహానాడు: ఎన్డీయే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వైసీపీ ప్రవేశపెట్టిన పలు పథకాల పేర్లలో మార్పులు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజా మరో పథకం పేరును మార్చింది. వైసీపీ ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. ఆ పథకానికి ‘చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా పేరు మార్చేసింది. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.10 వేల రుణసాయం అందించనుంది.