వైసీపీకి మరో షాక్!

– జనసేనలోకి బొత్స సోదరుడు

విజయనగరం, మహానాడు: జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు జనసేనలో చేరనున్నారు. వచ్చే నెల మూడోతేదీన పవన్ కల్యాణ్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవితో మంగళవారం రాత్రి ఆయన భేటీ అయ్యారు. ఆయనతో పాటు నెల్లిమర్ల నియోజవర్గంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.