‘పొదుపు’లో ఏపీ దేశంలోనే నెంబర్‌వన్

– నాబార్డు నివేదిక

అమరావతి : ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా సంఘాల పొదుపులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2023-24 మార్చికి అన్ని రాష్ట్రాల పొదుపు రూ. 65,084cr కాగా దక్షిణాది పొదుపు రూ 29,409 కోట్లు, ఇందులో ఏపీ పొదుపు రూ 17,292cr. ఇది దేశంలోనే అత్యధికం. ఆ తర్వాత తెలంగాణ (రూ 5,768 కోట్లు ), తమిళనాడు (రూ2,854 కోట్లు )కర్ణాటక (రూ 2,024 కోట్లు ) ఉన్నాయి. అలాగే ఏపీలో పొదుపు సంఘాలు 10,99,161 ఉండగా, ఒక్కో సంఘం సగటు పొదుపు 1,57,321. ఇది దేశంలోనే అత్యధికమని నాబార్డు నివేదికలో వెల్లడైంది.