ఏపీది దేశంలోనే అత్యుత్తమ క్రీడా విధానాం!

– క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

విజయవాడ, మహానాడు: దేశంలోనే అత్యుత్తమ క్రీడా విధానాన్ని రూపొందించామని, క్రీడా సంఘాల తోడ్పాటుతో ఇటువంటి క్రీడా పోటీలు జరగడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇండోర్ స్టేడియాలు నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, అమరావతిలో దేశంలోని అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందడుగు వేస్తున్నారని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న కాస వడ్లమూడి మోహనకృష్ణ మెమోరియల్ ఏపీ స్టేట్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండర్ -13 క్రీడల పోటీలలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. మోహనకృష్ణ చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు. నిర్వాహకులు మంత్రిని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాయుడు ని ఘనంగా సన్మానించారు. క్రీడాకారులకు కూటమి ప్రభుత్వహయాంలో అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాయుడు, మంత్రి రాంప్రసాద్ బ్యాడ్మింటన్ ఆడారు.