Mahanaadu-Logo-PNG-Large

వరద బాధితులకు అండగా ఏపీ జేఏసీ

వరద బాధితులకు తన సేవలతో ఏపీ జేఏసీ అమరావతి అండగా నిలుస్తోంది వాంబే కాలనీ వాసులకు గురువారం మంచినీరు, ఆహార పదార్థాల పంపిణీ చేసింది. ఇప్పటికే ఒక రోజు వేతనం(బేసిక్‌ పే)ను విరాళంగా అందించింది. ఈ కార్యక్రమంలో చి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ అమరావతి కోశాధికారి కనపర్తి సంగీతరావు, మాజీ అధ్యక్షుడు వీవీ మురళీకృష్ణ నాయుడు, ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం చైర్ పర్సన్ పారె లక్ష్మి, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.సుమన్, తదితరులు పాల్గొన్నారు.