-తెలుగుదేశంతోనే వారికి సామాజిక న్యాయం
-నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు
-మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం
నరసరావుపేట, మహానాడు: చరిత్రలో మాదిగలను దగా చేసిన ఏకైక పాలకుడు జగన్ రెడ్డి మాత్రమేనని నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు అన్నారు. నరసరావుపేట జమిందార్ ఫంక్షన్ హాలు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదిగలను కుటుంబసభ్యులుగా గుర్తించి ఎల్లవేళలా అండగా నిలిచిన నాయకుడు చంద్రబాబు మాత్రమేనన్నారు. కానీ, జగన్‌రెడ్డి మాత్రం దళితుల్ని చంపిన వారిని వెంటేసుకుని తిరుగుతు న్నాడన్నారని ధ్వజమెత్తారు. మాస్కులు అడిగినందుకు సుధాకర్‌ను వేధించి హింసించారన్నారు.
డాక్టర్ అనితా రాణిని వేధించారు..డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును వెంటేసుకుని తిరుగుతున్నాడు. దళితుల్లోని ఏ వర్గానికీ నష్టం జరగకుండా జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తామని చెప్పిన దమ్మున్న పార్టీ తెలుగుదేశం మాత్రమేనన్నారు. ఇప్పటికే డప్పు కళాకారులు, చర్మకారులకు 50 ఏళ్లకే పెన్షన్ అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో అందరికీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నాం. అదే సమయంలో బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేసి దళితులకు న్యాయం చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో సమావేశంలో ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, మందకృష్ణ మాదిగ, గోనుగుంట్ల కోటేశ్వరరావు, కపిలవాయి విజయ్‌కుమార్, కొట్ట కిరణ్, చిన్నపరెడ్డి, బీసీ నాయకులు బదుగుళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.