జగన్‌ రెడ్డివి నవరత్నాలు కావు…గులక రాళ్లు

గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి గుంటూరు: జగన్‌ రెడ్డి ప్రవేశపెట్టింది నవరత్నాలు కావని ‘‘గులక రాళ్లు’’ అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి ఎద్దేవా చేశారు. మంగళవారం 33వ డివిజన్‌ లక్ష్మీపురంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్నతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మమేకమవుతూ ముందు కుసాగారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Read More

భవన నిర్మాణ కార్మికులతో కన్నా సమావేశం

సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లిలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కార్మికులను మోసం చేసిన ఏకైక ప్రభుత్వం ఉందంటే అది వైకాపా ప్రభుత్వ మాత్రమేనని విమర్శించారు. శ్రమజీవుల రక్తాన్ని పన్నుల రూపంలో, జరిమానాల రూపంలో, పెంచిన రేట్ల రూపంలో, నాసిరకం మద్యం అమ్మకాల రూపంలో జుర్రుకుంటున్న వైసీపీ ప్రభుత్వ దోపిడీ నుంచి వచ్చే ఎన్నికల్లో విముక్తి కావాలని […]

Read More

కార్మికుల పొట్టకొట్టిన జగన్‌

-ఐదేళ్లలో వారి సమస్యలు విన్న పాపాన పోలేదు -కూటమి రాగానే వారికి న్యాయం చేస్తాం -మే డే వేడుకల్లో వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో కార్మికలోకం పొట్టకొట్టారని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు విమర్శించారు. ఎన్నికలకు ముందు ఒకట్రెండు హామీలపై కంటితుడుపు చర్యలు తప్ప గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ కార్మిక నాయకులను పిలిచి వారి కష్టనష్టాలు […]

Read More

తూర్పు నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించుకుంటాం

టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌ గుంటూరు, మహానాడు: కాపుల సత్తా చూపించి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నసీర్‌ను అఖండ మెజారిటీతో గెలిపిస్తామని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌ అన్నారు. డేగల ప్రభాకర్‌ ఆధ్వర్యంలో బుధవారం అర్బన్‌ టీడీపీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ కాపు నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తూర్పు ఉమ్మడి అభ్యర్థి నసీర్‌ హాజరయ్యారు. తూర్పు నియోజకవర్గంలో […]

Read More

మాదిగలను దగా చేసిన ఏకైక పాలకుడు జగన్‌

-తెలుగుదేశంతోనే వారికి సామాజిక న్యాయం -నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు -మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నరసరావుపేట, మహానాడు: చరిత్రలో మాదిగలను దగా చేసిన ఏకైక పాలకుడు జగన్‌ రెడ్డి మాత్రమేనని నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు అన్నారు. నరసరావుపేట జమిందార్‌ ఫంక్షన్‌ హాలు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదిగలను […]

Read More

రాజీనామా చేస్తేనే…మళ్లీ వాలంటీర్లుగా నియామకం

-లేకుంటే అధికారం చేపట్టాక కొనసాగించం -టెక్కలి వైసీసీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ వ్యాఖ్యలు శ్రీకాకుళం, మహానాడు: రాజీనామాలు చేసి ఎవరైతే వైసీపీకి పని చేస్తారో వారే తమ వాలంటీర్లు అంటూ టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే వైసీపీ కండువా కప్పుకుని పనిచేస్తారో వారే తిరిగి అధికా రంలోకి వచ్చాక మళ్లీ కొనసాగుతారని తెలిపారు. రాజీనామా చేయని వాళ్లు మనకు పనిచేయరని అర్థం చేసుకోవాలని, […]

Read More

ల్యాండ్‌ టైటిలింగ్‌తో మోసగిస్తే చూస్తూ ఊరుకోం

-మాఫియాతో ప్రజల్లో జగన్‌ విశ్వాసం కోల్పోయారు -బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ విజయవాడ, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ బుధవారం విలేఖరుల సమా వేశంలో మాట్లాడారు. 2047 నాటికి వికసిత భారత్‌ లక్ష్యంతో 24/7 శ్రామికుడిలా శ్రమిస్తున్న మోదీ, కార్మికులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ మీద ఏబీసీడీ అక్షరమాలకు అక్షరాలు కూడా సరిపోవట్లేదు. ఏ అంటే […]

Read More

గోకవరం సంత మార్కెట్‌కు పూర్వవైభవం తీసుకువస్తా

-జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ జగ్గంపేట, మహానాడు: దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన గోకవరం సంత మార్కెట్‌ను అధ్వాన స్థితికి తీసుకొచ్చిన ఘనత వైసీపీకే దక్కుతుందని జగ్గంపేట కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. బుధవారం సాయంత్రం గోకవరంలో అశే ష జనవాహినితో మహిళల హారతులు, నీరాజనాలతో ఆయన ఎన్నికల ప్రచార రోడ్‌ షో జోరుగా సాగింది. జగ్గంపేట శాసనసభకు సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని, అదేవిధంగా కాకినాడ […]

Read More

బోండా ఉమ రోడ్‌ షో

విజయవాడ, మహానాడు :సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలోని 64వ డివిజన్‌ ప్రజాశక్తి నగర్‌ నాలుగు స్తంభాల నుంచి కండ్రిక సెంటర్‌ వరకు విజయవాడ సెంట్రల్‌ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు బుధవారం రోడ్‌ షో నిర్వహించారు. సెంట్రల్‌ నియోజకవర్గంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధే తప్ప ఈ వైసీపీ పాలనలో ఒక్క శాతం కూడా పనులు ముందుకు సాగలేదన్నారు. తిరిగి కూటమిని గెలిపించుకోవాలని కోరారు.

Read More

జగ్గయ్యపేట అభ్యర్థి తాతయ్య ప్రచారం

జగ్గయ్యపేట, మహానాడు : సైకిల్‌ గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ తోటచర్ల గ్రామంలో జగ్గయ్యపేట టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య బుధవారం ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పెనుగంచిప్రోలు మండ లం తోటచర్ల గ్రామంలో పర్యటించారు. మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేశినేని శివనాథ్‌ను గెలిపించాలని కోరారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More