Mahanaadu-Logo-PNG-Large

ప్రభుత్వ ఆస్తులు మీ సొంత సొమ్మా?

– ఊసరవెల్లి రంగులుగా వైసీపీ మాటలు
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ

విజయవాడ: గడిచిన 5 సంవత్సరాలలో దోచుకోవడం తప్ప పాలన చేతగాని వైసీపీ జగన్ ప్రభుత్వం మరీ ఇంత దారుణంగా విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలను, స్థలాలను తాకట్టు పెట్టి దాదాపు 25000 కోట్లను అప్పుగా పొందింది. ఆ 25000 కోట్లు ఎక్కడ ఎలా ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలి.

కేవలం విశాఖలో మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను, ఆస్తులను తనఖా పెట్టేసాడు. ప్రభుత్వ ఆస్తులు మీ సొంత సొమ్మా? ఈరోజు ఏ శాఖలో చూసినా వేలాది కోట్ల పెండింగ్ బిల్లులున్నాయి. విపరీతమైన అవినీతితో రాష్ట్రాన్ని ఆర్ధికంగా చంపేశాడు జగన్.
ప్రజావేదికను కక్షతో కూల్చివేసి, ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయ అక్రమ కట్టడాలను నేడు ప్రభుత్వం తొలగిస్తుంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు వచ్చిందా జగన్ గారు?

5 సంవత్సరాలలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యమనేదే లేకుండా అప్రజాస్వామ్య పాలన చేసిన మీ అవినీతి పార్టీకి దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా ఎలా మద్దతునిస్తారు? ఎందుకిస్తారు? మీరు చేసిన అక్రమాలన్నీ బయటకు తీస్తాం. తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని కోరుతాము.