అన్యాయం జరుగుతుంటే గుండె మండదా?
హంతకులకు మళ్లీ పట్టం కడుతుంటే చూస్తూ కూర్చోవాలా?
బద్వేల్ బహిరంగ సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి
కడప జిల్లా బద్వేల్, మహానాడు : హత్యా రాజకీయాలు చేసే వాళ్లు అవసరమా అని పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా బద్వేల్‌లో బుధవారం భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఒక కిల్లర్.. కడప ఎంపీగా కడప స్టీల్ కోసం ఎప్పుడైనా కొట్లాడాడా? బాబాయిని చంపిన హంతకుడు అని తెలిసి మళ్లీ సీట్ ఇచ్చారు. మళ్లీ చట్టసభలకు పంపాలని చూస్తున్నారు. హత్యా రాజకీయాలు చేస్తున్నారు. సొంత చిన్నాన్నను చంపించిన వారికి సీటు ఇవ్వడం హత్యా రాజకీయాలు కావా? అని ప్రశ్నించారు. ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వాళ్లు అవసరమా? హంతకులను కాపాడే వాళ్లు అవసరమా? అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో సీబీఐ అన్ని ఆధారాలు చూపినా అవినాష్ రెడ్డికి శిక్ష పడలేదు. అన్యాయం జరుగుతుంటే గుండె మండదా? న్యాయం జరగకపోతే ఆవేశం రాదా? హంతకులకు మళ్లీ పట్టం కడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తుందన్నారు.
వైసీపీ అభ్యర్థి కబ్జా కోరట…
స్థానిక వైసీపీ అభ్యర్థి రబ్బర్ స్టాంప్ అంట. ఇక్కడ రాజ్యం ఆయనదేనట. మొత్తం కబ్జాలు.. గుట్టలు కూడా దోచేశాడని అంటున్నారు. రాష్ట్రం మొత్తం మాఫియా..ల్యాండ్, లిక్కర్, శాండ్ మాఫియా. ఇదే బద్వేల్‌కు రూ.500 కోట్లు ఇస్తామని జగన్ చెప్పారు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. సోమశిల ఎత్తిపోతల పథకం ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు…ఇవ్వలేదు. బ్రహ్మం సాగర్ ద్వారా తాగునీటి సమస్య లేకుండా చూస్తాం అన్నారు..నెరవేరలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చని వీళ్లు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి అవుతా. రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.