ఆహారం అందుతుందా.. లేదా?

– వరద బాధితులను అడిగితెలుసుకున్న సీఎం చంద్రబాబు

విజయవాడ, మహానాడు: ఆహారం అందుతుందా… లేదా? అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులను అడిగి తెలుసుకున్నారు. కాన్వాయ్, ఇతర వాహనాలు వెళ్ళలేని పరిస్థితుల్లో జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో సీఎం పర్యటించారు. దాదాపు నాలుగు గంటలు ఏకధాటిగా పర్యటించారు. మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా బాధితుల కష్టాలు తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు ఉంటాయని చెబుతూ.. కాలనీల చివర్లో ఉన్న ఇళ్లకు ఆహారం అందడం లేదన్న అంశంపై సీఎం ఆరా తీశారు.