చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

అమరావతి : ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. యువనేత నారా లోకేష్‌ ఆదేశానుసారం హైదరాబాద్‌కు చెందిన ఆర్‌కే ఈవెంట్స్‌ ప్రతినిధులు అమరావతి రాజధాని ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేసే నిమిత్తం 15 లారీలలో మెటీరియల్‌ను తీసుకొ చ్చారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే స్థలాన్ని ఎంపిక చేయాల్సి ఉంది.