బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్,మహానాడు: తాము ప్రభుత్వంలోకి రాగానే మాజీ సర్పంచ్‌ల పెండిరగ్ బిల్లులను చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీని ముట్టడిరచారు. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేశారు. చాంద్రాయన్ గుట్టతో సహా సుమారు 12 పోలీస్టేషన్లలో 1800 మంది సర్పంచులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని వెంటనే విడుదల చేసి, వారి పెండిరగ్ బిల్లులను విడదల చేయాలని బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. హమీ ఇచ్చి కాంగ్రెస్ మాజీ సర్పంచులను మోసం చేసిందేకాక ఇదేంటని నిరసన తెలిపితే అరెస్ట్ లు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.