వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు
తెనాలిలో ఆత్మీయ సమావేశం
తెనాలి, మహానాడు : గుంటూరు జిల్లా తెనాలిలోని శుభమస్తు కల్యాణ మండపంలో ఆదివారం వేమూరు నియోజక వర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు పాల్గొన్నా రు. ఈ సమావేశంలో ఆర్యవైశ్యుల సమస్యలు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ అభివృద్ధి గురించి చర్చించారు. ఆర్యవైశ్యులకు తెలుగుదేశం పార్టీ, తన సహకారం తప్పకుండా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తూనుగుంట్ల సాయిబాబా, పెండేలా వెంకటరావు, కొల్లిపర రాధాకృష్ణమూర్తి, ఆలపాటి ఉపేంద్ర, పబ్బిశెట్టి వెంకట సత్యకుమార్, నంబూరు గాంధీ, పొన్నగంటి నరేంద్రబాబు, పరుచూరి రవీంద్ర నాధ్,కల్వ మధు, కొల్లిపర వెంకట శివ బాపయ్య, చిదేళ్ల రంగారావు, వేమూరు నియోజకవర్గంలోని ఆర్య వైశ్యులు పాల్గొన్నారు.