అసోం మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ప్రధాన నిందితుడు మృతి

ధింగ్‌ : అస్సాంలోని ధింగ్‌లో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులలో ఒకరు శనివారం తెల్లవారు జామున చెరువులో దూకి మరణించాడు.

శుక్రవారం రాత్రి, పోలీసులు అరెస్టు చేసిన నిందితులను నేరస్థలానికి తీసుకువెళ్లారు. ఘటనకు సంబంధించిన క్రైమ్ సీన్ రీక్రియేట్ చేస్తున్న సమయంలో నిందితుడు పారిపోయేం దుకు ప్రయత్నిస్తూ సమీప చెరువులోకి దూకాడు. దీంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పోలీసులు సహాయంతో SDRF బృందం ఈ ఉదయం చెరువు నుండి నిందితుడి మృతదేహాన్ని వెలికితీసింది. ఆగస్టు 22వ తేదీ సాయం త్రం ఢింగ్ ప్రాంతంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గు రు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ సంఘటన తర్వాత, ధింగ్ ప్రాంతంలో భారీ ఎత్తు న నిరసనలు మొదలయ్యా యి. అక్కడ స్థానిక ప్రజలు, వివిధ సంస్థలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల ని డిమాండ్ చేశారు.

అస్సాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జిపి సింగ్ శుక్రవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీనియర్ పోలీసు అధికారులతో కూడా మాట్లాడారు.