– టీడీపీలో పలువురు నేతల చేరిక
అమరావతి : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వివిధ నియోజకవర్గాల్లో నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్తూ టీడీపీలో చేరుతున్నారు. బుధవారం శ్రీకాళహస్తి, కుప్పం నియోజకవర్గాలకు చెందిన ముగ్గరు జడ్పీటీసీలు, పలువురు నేతలు టీడీపీలోకి రాగా…గురువారం కర్నూలు, కదిరి, రాయదుర్గం, కోవూరు, అద్దంకి నియోజకవర్గాలకు చెందిన నేతలు ఉండవల్లి నివాసంలోని చంద్రబాబు సమక్షంలో చేరారు.
కోవూరు నియోజకవర్గానికి చెందిన నెల్లూరు జిల్లా వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు సూరా శ్రీనివాసులు రెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం జడ్పీటీసీ సూరా దీప, కౌన్సిలర్ అందె ప్రత్యూష, అద్దంకి నియోజకవర్గానికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అట్లా చిన్నవెంకటరెడ్డి, సంతమాగులూరు ఎంపీపీ ఏనుబర్ల యలమంద, కర్నూలు నియోజకవర్గానికి చెందిన మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖాసీ, వాసవీ పైపుల కంపెనీ అధినేత సత్రశాల జగన్నాథ్ గుప్తా, కదిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీలు పుల్ల విజయారెడ్డి, ఆవుల మనోహర్ రెడ్డి, లక్ష్మీ నారాయణ రెడ్డి, ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన కాటన్ బోర్డు మాజీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు డాక్టర్ నీలకంఠారెడ్డి, సహా ఆయా నియోజకవర్గాల మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు, సీనియర్ నాయకులు టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.