-చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి నానిపై వైసీపీ హత్యాయత్నం
-ఆసుపత్రికి తరలింపు
-చంద్రగిరిలో ఉద్రిక్తం
తిరుపతి : స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు.
నానితో పాటు ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డిపై కొంతమంది వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.
స్ట్రాంగ్ రూము వద్ద ఈవీఎంలను తారుమారు చేసే యత్నం జరుగుతున్నట్టు సమాచారం రావడంతో పులివర్తి నాని అక్కడకు వచ్చారు. ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు భారీగా ఉండటం చూసిన నాని వారిని ప్రశ్నించారు. అయితే ఈ సమయంలో వారు ఒక్కసారిగా నానిపై దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది.
దాడిని నిరసిస్తూ కూటమి నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పులివర్తి నాని కారు ధ్వంసం, గన్‌మెన్ ధరణికి తీవ్ర గాయాలయ్యాయి. 150 మందికిపైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేసి భయాభ్రాంతులకు గురిచేశారని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపించారు.
నడవలూరు సర్పంచి గణపతి, రామాపురానికి చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరుల ఆధ్వర్యంలో ఈ దాడి జరిగిందని వాపోయారు. ఈ ఘటనను చెవిరెడ్డి పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
ఓటమి భయంతోనే దాడులకు దిగారని విరుచుకుపడ్డారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ మూకలను అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని కూటమి నేతలు, కార్యకర్తలు స్పష్టం చేశారు.
దాడి సమాచారం తెలుసుకున్న ఎన్డీఏ కార్యకర్తలు మహిళా వర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు. నిందితులు అక్కడే ఉన్నారనే సమాచారంతో పద్మావతి మహిళా వర్సిటీ చెట్టు పక్కల గాలింపు చర్యలు చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ఓ కారులో వైసీపీ జెండాలు, మద్యం బాటిళ్లు, మారణాయుధాలు ఉండటంతో ఆ కారును ధ్వసం చేశారు.
మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసిన ప్రదేశంలో వైసీపీ గూండాలు మారణాయుధాలతో యథేచ్ఛగా తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నాని, కూటమి నేతలు ప్రశ్నించారు.
ఈ ఘటనతో మహిళా వర్సిటీ ప్రాంగణం రణరంగంలా మారింది. భారీగా పోలీసు బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపు చేశాయి. ఈ ఘటనతో స్ట్రాంగ్ రూం వద్ద భద్రతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తిరుపతి
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పై హత్యాయత్నం
పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఘటన
రామాపురంకు చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి, రాడ్లుతో దాడికి యత్నం
ఆత్మరక్షణ కోసం గాల్లో కాల్పులు జరిపిన గన్ మ్యాన్ ధరణి
రాళ్ల… pic.twitter.com/LiahOtZeHd
— Pulivarthi Nani (@NaniPulivarthi) May 14, 2024