ఓటమి భయంతో వైసీపీ గూండాల దాడులు

ఎన్ని అడ్డంకులు సృష్టించినా గెలిచేది కూటమే
టీడీపీ నాయకులపై దాడి, కారు ధ్వంసం హేయం
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి, మహానాడు : ఓటమి భయంతోనే వైకాపా గూండా నాయకులు దాడికి దిగుతున్నారని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కుంకలగుంట తెలుగుదేశం పార్టీ నాయకులపై వైకాపా గుండాల దాడిని ఖండిరచారు. సోమవారం దాడి జరిగిన ప్రదేశాన్ని, ధ్వంసమైన కారును ఆయన పరిశీలించారు. టీడీపీ నాయకులు గ్రామం నుంచి నరసరావుపేటకు కారులో వస్తుండగా దారి కాచి వెంటాడి గాయపరిచి కారును ధ్వంసం చేయడం హేయమన్నారు. పోలీసుస్టేషన్‌ ఆవరణలోనే ప్రజలకు రక్షణ లేదని ధ్వజమెత్తారు. ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గాయపడిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.