జర్నలిస్టులపై దాడులు చేస్తే ఊరుకోం!

– సీఎం, డిప్యూటీ సీఎంల హెచ్చరిక

అమరావతి, మహానాడు: జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, దాడులకు పాల్పడిన పార్టీ నుంచి బహిష్కరిస్తామని జర్నలిస్టులను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అది ఏ పార్టీకి చెందిన వారైనా సరేనని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవల జర్నలిస్టులపై కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ దృష్టికి జర్నలిస్టుల సంఘాల నేతలు తీసుకువెళ్ళారు. దీంతో వారు సానుకూలంగా స్పందించడంతో జర్నలిస్టు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.