– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
అమరావతి, మహానాడు: రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరద ఉధృతి నేపథ్యంలో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్లు అందుబాటులో ఉండి తగిన చర్యలు తీసుకుంటూ ప్రజలకు సేవలందించాలన్నారు.
వర్షాల వల్ల వచ్చే వ్యాధులు నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేయాలి. మారిన వాతావరణం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజా జీవనం స్తంభించింది.
ఈ కారణంగా రెవెన్యూ, పోలీసు శాఖలు 24 గంటలూ సేవలందిస్తున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి కూడా సమాచారం అందించాలన్నారు. అధికారులకు సమాచారం రాగానే వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.