Mahanaadu-Logo-PNG-Large

ప్రజల్లోనే బాబు…ప్రజలతోనే బాబు

ఎన్నికల ప్రచారంలో రికార్డు స్థాయిలో సభలు, పర్యటనలు
ఒక్క ప్రజాగళం పేరుతోనే 89 నియోజకవర్గాల్లో సభలు, రోడ్‌షోలు
అంతకుముందు రా కదిలి రా పేరుతో 25 పార్లమెంటు స్థానాల్లో సభలు
నాలుగు నెలల్లో 114 అసెంబ్లీ స్థానాల్లో కొనసాగిన ప్రభంజనం
బాదుడే బాదుడు, రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమాలతో చైతన్యం
ఐదేళ్లు ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం
వేల కిలోమీటర్ల ప్రయాణం..అలసట ఎరుగని దార్శనికుడు

 

అమరావతి, మహానాడు : సుదీర్ఘ రాజకీయ అనుభవం..14 ఏళ్లు ముఖ్యమంత్రి…నవ్యాంధ్ర రథసారథి…అలసట ఎరుగన దార్శనికుడు..భవిష్యత్‌కు భరోసా ఇచ్చే నాయకుడు…విజన్‌తో యువతకు మార్గదర్శకుడిగా నిలిచిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయా ల్లోనే కాదు..దేశ రాజకీయాల్లోనూ ఒక చరిత్ర. ప్రతిపక్షంలో ఉన్నా ఐదేళ్లు ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేసి ఎక్కువ సమయం జనంలో ఉన్న నేతగా రికార్డు సృష్టించారు. ఆయన ఎన్నికల ప్రచారంలో రికార్డు స్థాయి సభలు, పర్యటనల్లో పొల్గొన్నా రు. పెద్ద సంఖ్యలో సభలు, రోడ్‌ షోలు, సమావేశాలు నిర్వహించారు. విరామం, విశ్రాం తి అనేది లేకుండా రోజుకు 3 నుంచి 4 సభల్లో పాల్గొన్నారు. ఎండ, వాన లెక్క చేయకుం డా వందల కిలోమీటర్లు అలుపెరగని ప్రయాణం చేశారు.

114 నియోజకవర్గాల్లో ప్రజాగళం, రా కదిలి రా

ఒక్క ప్రజాగళం పేరుతోనే 89 నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు, రోడ్‌ షోలు జరిగాయి. ఎన్నికల సీజన్‌లో మార్చి 27 నుంచి ప్రజాగళం పేరుతో విస్తృత పర్యటనలను ఆయన ప్రారంభించారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసే సరికి 89 నియోజకవర్గాల్లో సభలు పూర్తయ్యాయి. అంతకు ముందు జనవరి 5 నుంచి రా కదలి రా పేరుతో 25 పార్లమెంటు స్థానాల్లో చంద్రబాబు భారీ సభలు జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి చేపట్టిన రా…కదలిరా, ప్రజాగళం సభలు కలిపి నాలుగు నెలల్లో 114 నియోజవకర్గాల్లో చంద్రబాబు పర్యటనలు సాగాయి.

ప్రజావ్యతిరేక విధానాలపై కార్యక్రమాలు

ఐదేళ్ల పాటు ప్రజల్లోనే ఎక్కువ సమయం ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అలుపెరగని పోరాటం చేశారు. ప్రభుత్వ పన్నులు, విద్యుత్‌ చార్జీల పెంపు, ధరల మంటపై రెండేళ్ల క్రితం బాదుడే బాదుడుతో పెద్దఎత్తున కార్యక్రమాలు కొనసా గాయి. 2022లో 19 నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. తరువా త ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో 2023లో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేశారు. 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదేంఖర్మ మన రాష్ట్రానికి పేరుతో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై కర్నూలు నుంచి పాతపట్నం వరకు 13 జిల్లాల్లో పర్యటించారు. జగన్‌ చేసిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై 2023 ఆగస్టులో ఏకధాటిగా 10 రోజులు పాటు పర్యటించి ఆయా సమస్యలపై ప్రభు త్వాన్ని నిలదీశారు. ప్రాజెక్టుల వారీగా జగన్‌ విధ్వంసాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ల తో ఎండగట్టారు.

అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసినా ఆగని పోరాటం

2023 సెప్టెంబర్‌ 9వ తేదీన చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైలులో పెట్టారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం మళ్లీ రోడ్డెక్కారు. మునుపటి కంటే స్ట్రాంగ్‌గా ప్రజా సమస్యలపై నిలదీశారు. అకాల వర్షాల సమయంలో గోదావరి జిల్లాల్లో నాలుగురోజులు పాటు బస చేసి మరీ ధాన్యం కొనుగోళ్ల కోసం పోరాటం చేశారు. తుఫాన్ల సమయంలో క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులు, బాధిత ప్రజలను పరామర్శించారు.