బందరు పోర్టు ను సందర్శించిన బాబు

మచిలీపట్టణం: కృష్ణా జిల్లా లో పర్యటనలో భాగంగా మచిలీపట్టణం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనలో స్వల్ప మార్పు చేసుకున్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో రాష్ట్ర గనులు, ఆబ్కారీ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి చేసిన విజ్ఞప్తి మేరకు మచిలీపట్టణం పోర్ట్ ను అధికారులతో కలిసి బుధవారం ముఖ్యమంత్రి పరిశీలించారు.

అధికారులు, పోర్ట్ ఇంజినీర్లతో కలిసి బందరు పోర్ట్ మాస్టర్ ప్లాన్ పరిశీలించి, క్షేత్రస్థాయిలో అక్కడి పరిస్థితులను పరిశీలించి వాటి వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ పనులు ఏ మేరకు పూర్తి అయ్యాయి, ఇంకా చేపట్టవలసిన పనులను గురించి అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యమంత్రి వెంట మంత్రులు పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి , ఎమ్మెల్సీ కంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యే లు వెనిగళ్ళ రాము, కాగిత కృష్ణ ప్రసాద్ , వర్ల కుమార్ రాజు, మండలి బుద్ధ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ డి. కె. బాలాజీ ,జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు ,, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్, పోర్ట్ ఇంజనీర్ తులసీదాస్, ప్రభృతులు పాల్గొన్నారు.