అభిమానులను దోచుకున్న చరిత్ర మెగా కుటుంబానిది కాదా?
కాపులను అడ్డం పెట్టుకుని సంపాదించుకోలేదా?
హెలికాప్టర్, ప్రత్యేక విమానాలు ఎక్కడివి?
పిఠాపురం ప్రచారంలో నీ కుటుంబమేది?
పవన్‌కళ్యాణ్‌కు పోతిన మహేష్ బహిరంగ లేఖ
విజయవాడ, మహానాడు : ఇటీవల టికెట్ రాక జనసేన నుంచి వైసీపీలో చేరిన పోతిన మహేష్ మరోసారి జనసేన అధినేత పవన్‌కళ్యా ణ్‌పై పలు ప్రశ్నలు సంధిస్తూ రెచ్చిపోయారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ గురువారం పవన్‌క ళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. మెగా కుటుంబానికి అభిమానుల దగ్గర నుంచి అన్ని తీసుకోవడమే..ఇవ్వడం తెలియదు. మెగా కుటుంబంలో జరిగిన ఏ ఒక్క శుభకార్యానికి అయినా అభిమా నులకు ఏనాడైనా ఒక ఇస్తరాకులో ప్లేటు భోజనమైన పెట్టారా? శుభకార్యాలకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్లో పెట్టి వ్యాపారం కూడా చేసుకుంటారు. కానీ పిఠాపురానికి మాత్రం గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. మీరు ప్రజలకు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి, కాపు యువతకు ఎప్పుడైనా..ఏమైనా చేశారా? వాళ్లను అడ్డం పెట్టుకుని అన్నీ సంపాదించుకుంటారు.
విమానం, హెలికాప్టర్ ఎక్కడివి…
పవన్‌కళ్యాణ్ ఐదేళ్లుగా తమరు వినియోగిస్తు న్న ప్రత్యేక విమానం, హెలికాప్టర్ ఖర్చుల గురించి ఎన్నికల అఫిడివిట్‌లో ఎందుకు చూపులేదు. ఇవి మీ సొంతమా లేక బినామీల ద్వారా కొనిపించి వాడుతున్నారా? అద్దెకు తీసుకుని చెల్లింపులు చేస్తున్నట్లు డ్రామాలు చేస్తున్నారా? విమాన రంగంలో కూడా పవన్‌కళ్యాణ్‌కు వాటాలు ఉన్నాయా? ఒక బినామీ కంపెనీ ద్వారా తమరు కొనుగోలు చేసి అందులో డైరెక్టర్‌గా వినయ్, విశ్వప్రసాద్‌లను నియామకం చేశారా? సామాన్య మధ్యతరగతికి (ఈ మధ్య ఉపన్యాసాల్లో చెబుతున్నారు) చెందిన మీరు ప్రత్యేక విమానాల్లో నిరంతరం ప్రయాణించేంత లగ్జరీ జీవితానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని ప్రశ్నించారు.
కాపుల చానళ్లను ఎందుకు ఎదగనివ్వరు…
కాపు సామాజికవర్గానికి చెందిన ప్రైమ్ 9 చానల్ రఘువీర్‌కు ఎందుకు విలువ ఇవ్వరు. 99 టీవీ చానల్ తోట సత్యనారాయణ, నెంబర్ 1 చానల్ సుధాకర్‌నాయుడుకు ఏనాడైనా మీరు సరైన రీతిలో మద్దతు ఇచ్చారా? కాపు సామాజికవర్గం వారు ప్రారంభించిన ఈ చానళ్లకు ఎందుకు అండగా నిలవలేదు. ఇదే సందర్భంలో కొన్ని వేరే చానళ్లపై మహాప్రేమ ఎందుకు చూపెడుతున్నారు? కాపు సామాజికవర్గం వారు ఏర్పాటు చేసిన చానళ్లను ఎందుకు ఎదగనివ్వరు?
విరాళాల దాతల గురించి చెప్పరు…చిరంజీవిని పబ్లిసిటీ చేస్తారా?
దాతలు, ఎన్‌ఆర్‌ఐలు ఇంకా చాలామంది జనసేన పార్టీకి పవన్‌కళ్యాణ్ చేతుల మీదుగా విరాళాలు ఇచ్చారు. వారి గురించి పవన్‌కళ్యాణ్ ఎప్పుడూ సరిగ్గా మాట్లాడలేదు. కానీ, మీ అన్న చిరంజీవి దగ్గర తీసుకున్న చెక్కును గదిలో తీసుకోవచ్చు కదా…ఎందుకు ప్రచారం చేశారు?
ఫోన్ నెంబర్లు ఎందుకు మారుస్తారు…పిఠాపురంలో నీ కుటుంబమేది?
ప్రతి 10 -15 రోజులకు ఫోన్ నెంబర్లు ఎందుకు మారుస్తారు? దానికి కారణం ఏంటి? మీ దగ్గర ఏ నెం బరు ఒకటి స్థిరంగా ఉండదంట కదా? కారణాలేంటి గతం తమరిని వెంటాడుతుందనా లేక అభద్రతా భావమా? ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందులలో వై.ఎస్.భారతి, కుప్పంలో భువనేశ్వరి, మంగళగిరిలో బ్రాహ్మణి ప్రచారం చేస్తున్నారు. మరి పిఠాపురంలో నీకు ఎవరు ప్రచారం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. చీ.. నీ బతుకు చెడ అంటూ మండిపడ్డారు.