Mahanaadu-Logo-PNG-Large

కవితకు బెయిల్… కాంగ్రెస్, బీజేపీ వ్యాఖ్యలపై జగదీష్ మండిపాటు!

హైదరాబాద్‌, మహానాడు: ఎమ్మెల్సీ కవిత బెయిల్ అంశం మీద కాంగ్రెస్, బీజేపీ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. కవిత బెయిల్ అంశంపై కాంగ్రెస్ , బీజేపీలవి చిల్లర మాటలు..
సుప్రీం కోర్టుని తప్పు బట్టే పద్ధతుల్లో కొంతమంది మాట్లాడుతున్నారు.. నిరాధారమైన కేసని మొదటి నుండి చెబుతున్నాం… మేం ఊహించినట్లుగానే కవిత ముత్యంలా బయటకు వచ్చారు. చరిత్రల్లో సీబీఐ, ఈడీలు నమోదు చేసిన పరమ చెత్త కేసుల్లో ఇదొకటి..

పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్, కేజ్రీవాల్ ని ఇబ్బందిపెట్టడానికే ఈ కేసు పెట్టారు… విచారణ సందర్బంగా ఆధారాలు లేకపోవడంతో ఈడీ సీబీఐ న్యాయవాదులు ఇబ్బందిపడ్డారు.. నోట్ల కట్టలతో పట్టపగలు దొరికి అధికారం చేలాయిస్తున్న మీరు నిరాధార కేసులో కవిత బెయిల్ పై వస్తే ఏడుపెందుకు? టీ కాంగ్రెస్సే మోడీకి బీ టీమ్ గా పనిచేస్తోంది… మోడీ దగ్గర రేవంత్ కి ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి, బండిలకు లేదు…
రేవంత్ సీఎం కావడం మోడీ చాయిసే… వాల్మీకి కుంభకోణంలో టీ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉన్నా బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు… కాంగ్రెస్, బీజేపీలు కలిసి కేసీఆర్ పై అక్కసు వెళ్లగక్కి వారి బలహీనతలను బయటపెట్టుకుంటున్నాయి… లిక్కర్ కేసులో రాహుల్, రేవంత్ లు విరుద్ధంగా మాట్లాడుతున్నారు… అయితే గయితే పీసీసీ సహా తెలంగాణా కాంగ్రెసే బీజేపీలో విలీనమౌతుంది… బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాదు.. ఎప్పటికయినా మోడీ, రాహుల్ కి ప్రత్యామ్నాయం కేసీఆరే..