Mahanaadu-Logo-PNG-Large

బక్రీద్ ఖుర్బాని బీదలపాలిట మహాదానం

– రుస్తుం అంతర్జాతీయ చిత్రకారులు

బక్రీద్ పండుగను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో నేడు ఆదివారం “బక్రీద్ ఖుర్భాని ముబారక్” క్యాన్వాస్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు.

పండుగలు సమాజంలో నిస్తేజాన్ని తొలగించి జీవితాలను కళావంతం చేస్తాయి. బక్రీద్ ఈదుల్ జుహ పర్వదినం త్యాగానికి సహనానికి ప్రతీక అనీ పండుగ నాడు ధనవంతులు తమకు కల్గిన సంపదలో బీదలకు రెండున్నర శాతం వస్తురూపేన పంచి అల్లా కృపకు పాత్రులు కావాలని అల్ ఖురాన్ భోదిస్తుందని పండుగ నాడైన బీదవాడు కడుపునిండా తినాలని ఇచ్చే “మహాదానం ఖుర్భాని” అంతర్భావ ముఖ్య ఉద్దేశం. బక్రీద్ ప్రపంచ మానవాళి కి త్యాగం, సహజీవనం, ఐక్యత, శాంతి, సంతోషాలను అందిస్తుందని, బీదలకు ధనవంతులు తప్పకుండ ఖుర్భాని దానము అందించాలని ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం అందరికి బక్రీద్ ముబారక్ తెలియజేశారు .

ఈ కార్యక్రమంలో ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం, అసిస్టెంట్ ప్రొఫెసర్ రుబినారుస్తుం, మహ్మద్ రహీమ్, తదితరులు పాల్గొన్నారు