– ఉత్తర్వులిచ్చిన పార్టీ అధినేత బాబు – ముందే చెప్పిన ‘మహానాడు’ టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసయాదవ్ నియమితులయ్యారు. ఆ మేరకు పార్టీ అధినేత-సీఎం చంద్రబాబునాయుడు ఉత్తర్వు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పల్లా శ్రీనివాసయాదవ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. కాగా నిన్నటి వరకూ పార్టీ అధ్యక్షుడిగా కృషి చేసిన అచ్చెన్నాయుడు సేవలను చంద్రబాబు అభినందించారు. ఇదిలాఉండగా.. పల్లాకు […]
Read Moreమూడు వారాల్లో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ
పురపాలక – పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, జూన్ 16 : నిరుపేదలకు కేవలం రూ.5/- లకే ఉదయం టిఫిను, రూ.5/- లకే మద్యాహ్న భోజనం మరియు రూ.5/- లకే రాత్రికి భోజనం అందజేసే అన్నా క్యాంటీన్లను మూడు వారాల్లో పునరుద్దరిస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఆదివారం ఉదయం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్నా […]
Read Moreముస్లింలకు జగన్మోహన్‌రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు
తాడేపల్లి: ముస్లిం సోదర సోదరీమణులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్‌రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగనిరతికి, ధర్మబద్ధతకి, దాతృత్వానికి బక్రీద్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారన్నారు. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని జగన్ అభిలషించారు.
Read Moreచీనాబ్ రైల్వే బ్రిడ్జీపై ట్రయల్ రన్ విజయవంతం
జమ్మూలోని చీనాబ్ నదిపై నిర్మించిన అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ వంతెనపై నిర్వహించిన ట్రయిల్ రన్ విజయవంతమైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ట్రైన్ ఇంజన్ ను టెస్ట్ చేయగా విజయవంతంగా అది రియాసి స్టేషన్ కు చేరుకుందని తెలిపారు. దీంతో త్వరలోనే రాంబన్ జిల్లాలోని సంగల్దాన్ నుంచి రియాసి మధ్య త్వరలో సేవలు ప్రారంభం కానున్నాయి.
Read Moreటీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన జే. శ్యామలరావు
టీటీడీ కార్యనిర్వహణాధికారిగా జే. శ్యామలరావు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి నుండి బాధ్యతలు స్వీకరించారు. నూతన ఈవో తన సతీమణితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత జేఈఓ వీరబ్రహ్మం ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. కాగా, తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహ […]
Read More19వ తేదీన పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ నెల 19వ తేదీ, బుధవారం నాడు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్ కి కేటాయించిన సంగతి విదితమే. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను కేటాయించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Read Moreసౌతాఫ్రికాపై భారత్ విజయం
సౌతాఫ్రికా మహిళలతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ మహిళలు ఘనవిజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 265/8 పరుగులు చేసింది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 37.2 ఓవరల్లో 122 పరుగులకే ఆలౌటయింది. దీంతో భారత్ కు 143 పరుగుల భారీవిజయం దక్కింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో సునే(33), జఫ్టా(27) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఆశాశోభన 4, దీప్తిశర్మ 2, పూజా, రేణుక, […]
Read Moreజగన్ రెడ్డి కోడెలకి చేసిందే ఈరోజు తనకు తిరిగి వచ్చింది
ఫర్నిచర్ దొంగ జగన్ చేయని తప్పుకు నాడు కోడెల శివప్రసాదరావును బలితీసుకున్నారు ప్రజల్లో ఈ అరాచకాలపై చర్చ జరగాలి రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రతిపక్ష నేత జగన్ ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్ సరెండర్ చేయకుండా వాడుకుంటుూ వైసీపీ నేతలు నీతులు చెప్పడం సిగ్గుచేటు.గతంలో ఫర్నీచర్ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, స్వర్గీయ కోడెల శివప్రసాద్పై అసత్య ఆరోపణలు […]
Read Moreజనం సొమ్ముతో జగనయ్య జల్సా..
( వెంకట్) విశాఖ సాగర తీరాన అంద చందాల రుషి కొండపై జనం కప్పం కట్టిన రూ. 500 కోట్లతో వెలసిన జల్సా ప్యాలెస్.. రాజ మహల్ ను మరిపిస్తోంది.. ఎన్నికల్లో గెలిచిన ఆనందంతో.. మాజీ సీఎం జగనయ్య ప్రేమగా కట్టించిన ఈ భవనాన్ని చూడాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కుతూహలంతో తెగ ఆరాట పడ్డారు. ఇప్పటి వరకూ ఇతరులకు నో ఎంట్రీ పేరిట సెక్యూరిటీ గార్డుల […]
Read Moreకష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి
నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై మండిపడ్డ కేటీఆర్ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా పట్టించుకోని కేంద్రం ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం.. మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు.. నీట్ వ్యవహారంపై స్పందించాలి మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టాలి..వెంటనే బాధ్యులను శిక్షించాలి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో […]
Read More