– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, మహానాడు: ప్రముఖ తెలంగాణవాది, మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి మృతి దిగ్భ్రాంతికరం… వారు మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చిన్నతనం నుంచి జాతీయవాద రాజకీయాలకు, బీజేపీతో సన్నిహితంగా ఉంటూ సమాజం కోసం ఎంతో తపనపడే వారు… బీజేపీలోనూ చేరి నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన అనేక ఉద్యమాలు, పోరాటాల్లో భాగమయ్యారు… ఉద్యమ కాలం నుంచే వారితో వ్యక్తిగతంగానూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జిట్టా బాలకృష్ణా రెడ్డి కుటుంబీకులకు, మిత్రులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని నిండుమనసుతో భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.