కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
పాల్గొన్న అభిమానులు, టీడీపీ నాయకులు
నరసరావుపేట/సత్తెనపల్లి: యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నరసరావుపేట, సత్తెనపల్లిలో ఎన్‌బీకే అభిమానులు, టీడీపీ, నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా జరిగాయి. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆదిత్యబాబు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో పల్నాడు జిల్లా ఐటీడీపీ అధికార ప్రతినిధి గుత్తా అంకమ్మ చౌదరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేక్ కట్ చేసిన కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి పట్టణం రఘురామ్‌నగర్ ప్రజావేదికలో నందమూరి బాలకృష్ణ 64వ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కేక్ కట్ చేసి శుభాకాం క్షలు తెలిపారు. అనంతరం సత్తెనపల్లి పట్టణంలోని ఆదరణ వయోవృద్ధుల ఆశ్ర మం, మోల్లమాంబ వయోవృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.