అమరావతి, మహానాడు: జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య చేరారు. జనసేన కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ కండువా కప్పి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. అలాగే, విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అవనపు విక్రమ్, అవనపు భావన, ప్రకాశం జిల్లాకు చెందిన యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జెడ్‌పీటీసీ యాదాల రత్నభారతి కూడా జనసేనలో చేరారు.