ఎమ్మెల్యేను కలిసిన బాపు శిష్యుడు 

అవనిగడ్డ, మహానాడు : ప్రఖ్యాత చిత్రకారుడు దివంగత బాపు శిష్యుడు, నరసాపురం పట్టణానికి చెందిన చిత్రకారుడు, కళారత్న బిరుదాంకితులు కడలి సురేష్, విజయవాడ మన గ్రామం అధినేత మొవ్వ రామకృష్ణ బుధవారం అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆగస్టు నాలుగో తేదీ దివిసీమ గాంధీ, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ పునర్నిర్మాత మండలి వెంకట కృష్ణారావు జయంతి పురస్కరించుకొని కడలి సురేష్ చిత్రించిన మండలి వెంకట కృష్ణారావు – ప్రభావతి దంపతుల చిత్రాన్ని బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులకు బహుకరించారు. ఈ సందర్భంగా వారిని బుద్ధప్రసాద్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పాల్గొన్నారు.