జాతీయ సదస్సు సమీక్షకునిగా భమిడిపాటి

శ్రీకాకుళం, మహానాడు: రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న జాతీయ సదస్సు లో సమీక్షకునిగా ప్రముఖ రచయిత భమిడిపాటి గౌరీశంకర్ ను ఆహ్వానించింది. స్థానిక గాయత్రి కాలేజీ అఫ్ సైన్స్ అండ్ మేనేజ్ మెంట్ కళాశాలలో తెలుగు విభాగాధిపతి గౌరీశంకర్‌ పనిచేస్తున్నారు. కథ, వ్యాసం, కవిత ప్రక్రియలలో పద్దెనిమిది పుస్తకాలు ప్రచురించారు. ఈ సందర్బంగా ఆయనను సంస్థల అధినేత జీవీ స్వామి నాయుడు, ప్రిన్సిపాల్ డాక్టర్‌ పులఖండం శ్రీనివాసరావు, కరస్పాండెంట్ రంగారావు, కెవీవీ సత్యనారాయణ, ఐక్యూఏసీ సమనవ్యయకర్త డాక్టర్‌ కె.మార్తండ్‌ కృష్ణ, తదితర అధ్యాపకులు అభినందనలు తెలిపారు.