సత్తెనపల్లి, మహానాడు: అంగరంగ వైభవంగా సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నాలక్ష్మి నారాయణ పుట్టిన రోజు వేడుకలు మంగళవారం జరిగాయి. కన్నా జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా అభిమానులు ఉదయం నుంచి సాయంత్రం వరకు బాణసంచా పేల్చారు. పట్టణంలో వెంకటటేశ్వర గ్రాండ్ నందు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను నియోజకవర్గ నాయకులు, ప్రజల కేరింత ల మధ్య కట్ చేసి, తినిపించారు. పలు ప్రాంతాల్లో పేద మహిళలకు చీరలు, వృద్ధులకు దుప్పట్లు, పండ్లు కన్నా పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.