రుణమాఫీతో బీజేపీ, బీఆర్ఎస్ కు నిద్ర పట్టడం లేదు 

బీజేపీ ఎన్ని వేలకోట్లు రుణమాఫీ చేశారో చెప్పగలరా?
– టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్, మహానాడు:  సోనియా గాంధీ,రాహుల్ గాంధీ డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ రెండో దశలో 2లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను కల్లా అవుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. మూడు దఫాలుగా.. చేయనున్న ఈ రుణమాఫీని ఆగస్టు 15 లోపు ప్రభుత్వం పూర్తి చేసందుకు ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా.. మొదటి విడతగా లక్ష రూపాయల మేర రుణాలు ఉన్న రైతుల అకౌంట్లతో డబ్బు జమ చేసింది. సోనియా గాంధీ,రాహుల్ గాంధీ డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ రెండో దశలో 2లక్షల రుణమాఫీ మొదలైంది.

రుణమాఫీతో బీజేపీ,బీఆర్ఎస్ వాళ్లకు నిద్రపట్టడం లేదు

సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయగానే రైతుల ఇళ్లల్లో సంబరాలు.. ప్రతిపక్ష నేతల ఇళ్లలో ఆందోళనలు మొదలయ్యాయి. కొందరు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిద్ర మాత్రలు వేసుకొని పడుకున్నారు. హరీష్ రావు ఫైనాన్స్ మినిస్ట్స్, మీ మామ సీఎంగా ఉండి.. పది ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేశారు. అందులో రైతుల రుణమాఫీ చేసింది కేవలం 26 వేల కోట్లు మాత్రమే. సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు  నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 31 వేల కోట్ల రుణమాఫీ మొదలైంది.

బీజేపీ ఎన్ని వేలకోట్లు రుణమాఫీ చేశారో చెప్పగలరా?

నాలుగున్నరేళ్ల సమయం ఉన్నా.. ఆరు నెలల్లోనే రుణమాఫీ పూర్తి చేస్తున్నాం. బీజేపీ పదేళ్లు కేంద్రంలో ఉండి దేశంలో ఉన్న రైతులకు ఎన్ని వేల కోట్లు రుణమాఫీ చేశారో చెప్పగలరా అని బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు సవాల్ విసిరారు. పదేళ్లలో నిరో మోడీ.. విజయ్ మాల్యా లాంటి పది మందికి 16 లక్షల కోట్లు మాఫీ చేశారు. అందులో రైతులు ఉన్నారా చెప్పండి.
యూపీఏ హయాంలో ఒకసారి 75వేల కోట్లు రుణాలు మాజీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. పదేళ్లలో రైతులు కేసీఆర్ మీద పెట్టుకున్న ఆశలను ఖూనీ చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతు నల్ల చట్టాలు తెచ్చి, రైతు హత్యలు చేశారు. దీని మీద చర్చకు వస్తారా అని ప్రశ్నించారు. ఢిల్లీలో రైతులు నిరసనలు తెలిపితే.. మంత్రుల పిల్లల వాహనాలతో మర్దర్లు చేశారు.

చిరంజీవి సినిమా హిట్.. రైతులు ప్లాప్

రైతుల పక్షాన ఉన్నట్లు చిరంజీవి ఖైదీ నంబర్ 150 తీశారు. ఢిల్లీలో రైతులు నిరసనలు చేస్తుంటే ఎందుకు చిరంజీవి మద్దతు తెలుపలేదు. తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇస్తుంటే రైతుల గురించి ఎందుకు చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. డిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తుంటే,రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చారన్నారు.