రూ.10 వేల కోట్లు దిగమింగిన షిండే, ఫడ్నవీస్
అంబులెన్స్‌ల కొనుగోళ్లలో చేతివాటం
బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
గప్‌చుప్‌గా అవినీతి ప్రసార మాధ్యమాలు
మహారాష్ట్ర, మహానాడు : షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం రూ.10 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఓ టీవీ చానల్ సంచలనాత్మక కథనం ప్రసారం చేసింది. అంబులెన్స్‌ల కొనుగోలు ఒప్పందం దుర్వినియోగంపై బాంబే హైకోర్టు షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. సుమీత్ ఫెసిలిటీస్, బీవీజీ కంపెనీలు ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల విలువైన అంబులెన్స్‌లను అందించడానికి టెండర్‌ను పొందింది. ముఖ్యమంత్రి షిండే (శివసేన), ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ (బీజేపీ) ప్రభుత్వం టెండర్ నిబంధనలను మార్చాలని ఆరోగ్య శాఖ కమిషనర్ ధీరజ్కుమార్పై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. సుమీత్ ఫెసిలిటీస్, బీవీజీ అనే రెండు కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేందుకు టెండర్ బిడ్డింగ్ ధర అసలు ధర కంటే రెట్టింపు చేశారు. ప్రీ-బిడ్ సమావేశం తీసుకోలేదు.
టెండర్ ఫైలులో అవకతవకలు జరిగాయని వికాస్ లవండే అనే వ్యక్తి బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. అయితే ఇప్పటివరకు ఏ మీడియా దీనిని ప్రసారం చేయలేదు. ఓ టీవీ చానల్ తొలిసా రిగా దీనిని ప్రసారం చేసింది. ఇంత భారీ కుంభకోణం జరిగినా ప్రధాన ప్రసార మాధ్యమాలు దాని గురించి ప్రైమ్ టైమ్ డిబేట్ చేయడం మర్చిపోయారా? మీడియా పూర్తిగా అమ్ముడుపోయిందా? ఈ అంబులెన్స్ స్కామ్ గురించి తెలుసుకునే అర్హత భారతీయులకు లేదా? మరాఠీ సామ్ టీవీ ప్రశ్నించింది.