తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ

రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిరది
అందుకే మాకు ఆదరణ…ఓటింగ్‌ పెరిగింది
వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం
హామీలు అమలుచేయని కాంగ్రెస్‌ మోసాలను ఎండగడతాం
మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఢిల్లీ:  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ గతంలో కంటే గణనీయమైన సీట్లు, ఓట్ల శాతం సంపాదించాం. సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో గత పదేళ్ల తెలంగాణలోనూ స్వతంత్రంగా పోటీచేసి ఇన్ని సీట్లు ఏనాడూ పొందలేదని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచాం. ఈ పార్లమెంటు ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలిచాం. మోదీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు ఇది నిదర్శనమన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 14 శాతం ఓట్లతో 8 చోట్ల గెలిపించుకున్న తెలంగాణ ప్రజలు..సరిగ్గా 6 నెలల తర్వాత జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో 35 శాతం ఓట్లతో 8 పార్లమెంటు సీట్లను అందించారు. తెలంగాణలో బీజేపీ సరైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ప్రజల ఓటింగే ఇందుకు నిదర్శనమన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్ల శాతం 39 కాగా.. ఇప్పుడది 40 శాతం చేరింది. ఆరు నెలల తమ పాలకు రెఫరెండంగా ప్రకటించుకున్న కాంగ్రెస్‌ కేవలం ఒక శాతం ఓటును మాత్రమే అదనంగా పొందిందని తెలిపారు. అదే సమయంలో మా ఓటు శాతం రెండున్నర రెట్లు పెరిగింది. 2014 ఎన్నికల్లో 8.5 శాతంతో 20,40,360 ఓట్లు సాధించాం. 2019 ఎన్నికల్లో 19.65 శాతంతో 36,26,173 ఓట్లు సాధించాం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 35.08 శాతంతో 76,47,424 ఓట్లు సాధించాం. ఐదేళ్లలో బీజేపీకి 40 లక్షల ఓట్లు పెరిగాయని వివరించారు. కొత్తగా 14 లక్షల కుటుంబాలకు పైగా బీజేపీకి అండగా నిలిచాయని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ ఉనికిని కోల్పోయింది…

బీఆర్‌ఎస్‌కు 14 చోట్ల 3వ స్థానానికే పరిమితమైంది. 8 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఖమ్మం, మహబూబాబాద్‌ తప్ప మిగిలిన చోట్ల మూడో, నాలుగో స్థానానికి పడిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్థానాలు గెలిచిన చోట్ల కూడా ఈసారి ఓట్లు తగ్గాయి. ఆయా స్థానాల్లో బీజేపీ పుంజుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో మా అభ్యర్థి డీకే అరుణ గెలిచారు. గతంలో రేవంత్‌ ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరిలో ఈటెల దాదాపు 3.5 లక్షల మెజారిటీతో గెలిచారు. కేసీఆర్‌ సొంత జిల్లాలోనూ మా అభ్యర్థి రఘునందన్‌రావు గెలిచారు. గజ్వేల్‌, సిద్దిపేట, బీఆర్‌ఎస్‌ కంచు కోట మెదక్‌లో వందల కోట్లు ఖర్చుపెట్టినా బీజేపీ గెలిచింది. రిజర్వేషన్లపై విషప్రచారం చేసినా ప్రజలు మా వెంటే ఉన్నారు. రానున్న రోజుల్లో ప్రత్యామ్నా య శక్తిగా నిలుస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందన్నారు. పార్లమెంటు 8 సీట్ల పరిధిలోని 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచినట్లు తెలిపారు. ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకుని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పడేందుకు అవసరమైన కృషిచేస్తామని తెలిపారు.

రాష్ట్రంలో రాజకీయ శూన్యత

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ బలహీనపడటం, ఆర్నెళ్లలో కాంగ్రెస్‌పై తీవ్రమైన వ్యతిరే కత వస్తున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొంది. ఈ పరిస్థి తు ల్లో ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా ఉండాలని అండగా నిలిచారు. రాష్ట్రంలో పరిస్థితులు మారతాయని, సోనియమ్మ, ఇందిరమ్మ పాలన తెస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన రేవంత్‌ ఇచ్చిన హామీలను అమలు చేయ డంలో విఫలమయ్యారని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికలకు అవసరమైన డబ్బులను వసూలు చేశారన్నారు. కాం గ్రెస్‌ పార్టీ మోసాలను ఎండగడతాం. ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముం దుకెళతామని వివరించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి, పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలో.. ఎన్డీయే కూటమి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో రామమందిరం రాజకీయ పరమైన అంశం కాదని, దేశ వ్యాప్తంగా చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆధారంగానే మేం ఎన్నికలకు వెళ్లామని వివరించారు.