Mahanaadu-Logo-PNG-Large

బీజేపీ రైతు భరోసాను ఆపేసింది!

-రైతుల నోటికాడి ముద్దను లాగేసి.. అన్నదాతల నోట్లో మట్టి కొట్టింది
– మంత్రి జూపల్లి కృష్ణారావు

తెల్లారితే రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమవుతుందనగా నోటికాడి బుక్కను బీజేపీ లాగేసిందని, . రైతు భరోసాను ఆపేయాలని ఎన్నికల సంఘానికి ఆ పార్టీ నాయకులు లేఖ రాశారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయనగా బీజేపీ అడ్డుకుని అన్నదాతల నోటికాడి ముద్దను లాగేసిందని మంత్రి జూపల్లి ఒ ప్రకటనలో పేర్కొన్నారు. పెట్టుబడి సాయంపై బీజేపీ సైంధవుడి పాత్రను పోషించి, పుట్టెడు ఆశలు పెట్టుకున్న రైతుల నోట్లో మట్టికొట్టిందని తెలిపారు.

ఎన్నికల వేళ రైతన్నలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని, రైతులకు మేలు చేసే పార్టీ ఏదో, కీడు చేసే పార్టీ ఏదో గమనించాలని సూచించారు. రైతు భరోసాపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కుట్ర రాజకీయాలు చేశారని, రైతుల కష్టనష్టాలతో పట్టింపు లేకుండా రాజకీయ స్వలాభం కోసం నీచంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో తమకు ఏ పార్టీ అండగా ఉంటుందో గుర్తెరిగి ముందుకు సాగాలని అన్నారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా రైతుల కోణంలో ఆలోచించి రైతు భరోసా పంపిణీకి అనుమతిని పునరుద్ధరించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.