-చేవెళ్లలో కలిసికట్టుగా పనిచేశాం
-ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
చేవెళ్ల: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మోదీ వేవ్ చెవెళ్లలో వచ్చింది కాబట్టే ఇంత మెజారిటీ వచ్చింది. అందరం కలిసి పనిచేయడం వల్ల గెలుపు సాధించాం. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వాళ్లు కూడా బీజేపీకి వేయడం వల్లే గెలుపు వచ్చిందని తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం ఉందన్నారు. గత ప్రభుత్వం ఖర్మ ఇప్పటి ప్రభుత్వం అనుభవిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉందన్నారు. చేవెళ్లకు కేంద్ర ప్రభుత్వ పథకాలు వచ్చేలా చూస్తాను..రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి పనులు చేయిస్తామ ని తెలిపారు. తాండూరులో పొల్యూషన్ తగ్గించే ప్రయత్నం చేస్తా..టమాటా రైతుల సమస్యలను పరిష్కారానికి ప్రయత్నం చేస్తాను. కాళేశ్వరంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు దారిలో వెళుతుంది. అది వాళ్లకే నష్టం. పాడైన కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేయించడం వృథా అన్నారు. 111 జీవో విషయంలో నా మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపారు.