Mahanaadu-Logo-PNG-Large

పల్నాడులో బాంబులు, మారణాయుధాలు స్వాధీనం

పిన్నెల్లిలో పోలీసు తనిఖీల్లో ముగ్గురి అరెస్ట్‌
అదుపులో పెట్రోలు బాంబులు తయారు చేసే వ్యక్తి
వివరాలు వెల్లడిరచిన ఎస్పీ బిందు మాధవ్‌

గురజాల, మహానాడు : పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో కార్డన్‌ సెర్చ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహించగా వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్‌ బాంబులను పోలీసులు గుర్తించారు. ఇటీవల ఎన్నికలకు సంబంధించిన గొడవలపై విచారణకు పోలీసులు గ్రామానికి వెళ్లి వైకాపా, తెదేపా నేతలను అదుపులోకి తీసుకునే క్రమంలో తనిఖీలు చేపట్టారు. వైకాపా నేతల ఇళ్లలో బాంబులు, మారణాయుధాలు గుర్తించారు. ఈ సందర్భంగా దాచేపల్లి పోలీసుస్టేషన్‌లో గురువారం పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. గురజాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో హింస చెలరేగుతుండటంతో గత రెండురోజులుగా గ్రామాల్లో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇదే క్రమంలో గురువారం ఉదయం పిన్నెల్లి గ్రామంలో 50 పెట్రోల్‌ బాంబులు, నాటు బాంబులు, వేట కొడవళ్లు, గొడ్డళ్లు లాంటి మారణాయుధాలు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు వివరించారు. పెట్రోలు బాంబులు తయారు చేసే ఒక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నామని తెలిపారు. విచారణ అనం తరం నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.