భారీ వర్షాలతో ఛార్ ధామ్ యాత్రకు బ్రేక్ 

ఉత్తరాఖండ్‌, మహానాడు : దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. బద్రీనాథ్‌ నేషనల్ హైవేపై పలుచోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఫలితంగా అక్కడ వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతో ఛార్ ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే పేర్కొన్నారు.