అమరావతి, మహానాడు: సచివాలయంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఒవెన్, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. బ్రిటిష్ బృందం సీఎం చంద్రబాబుతో భేటీకి ముందు మంత్రిని బుధవారం కలిసింది. రాష్ట్రంలో పట్టణాలు, నగరాలను ఎలా అభివృద్ధి చేయాలనుకుంటుందనే విషయాన్ని బ్రిటిష్ బృందానికి మంత్రి నారాయణ వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణంపై బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ కు మంత్రి పూసగుచ్చినట్టు వివరించారు.