ఆ పార్టీకి రెండు, మూడు చోట్ల డిపాజిట్లే ఎక్కువ
జూన్ 5 తర్వాత వారికి కేఏ పాల్ గతే
కవిత పనివల్ల పక్క రాష్ట్రాలకు వెళ్లలేకపోతున్నాం
సన్నబియ్యాన్ని ప్రోత్సహించేందుకే బోనస్
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, మహానాడు : పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్ భూస్థాపితం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కవిత జైలుకు పోయింది, తమ ప్రభుత్వం ఓడిపోయిందనే ఫ్రస్టేషన్‌లో కేటీఆర్ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మాటలు అసహ్యంగా ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు, 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినందుకా తిడుతుంది? దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి కట్టి అభివృద్ధి చేశామని చెబుతున్నారు. ఎయిర్ పోర్ట్, పీవీ ఎక్స్‌ప్రెస్ వే లాంటివి కట్టిన మేమేమనాలి? అంటూ ప్రశ్నించారు.
పేదలకు సన్నబియ్యం కోసమే బోనస్
ఐఏఎస్‌లను అందరినీ పక్కన పెట్టి నలుగురినే కేటీఆర్ ప్రోత్సహించారు. ఉద్యమకారుడు కేకే మహేందర్‌రెడ్డిని బీఆర్‌ఎస్ నుంచి వెళ్లగొట్టిందే కేటీఆర్. ఈ ఎన్నికల్లో 12 సీట్లకు తగ్గకుండా గెలవబోతున్నాం. బీఆర్‌ఎస్‌కు రెండు, మూడు చోట్ల డిపాజిట్ వస్తే ఎక్కువ. బీఆర్‌ఎస్ హయాంలో మద్యం అమకాలు పెరిగాయి తప్ప అభివృద్ధి జరగలేదు. వైన్ షాపుల పేరు మీద 2500 కోట్లు గత ప్రభుత్వం రాబట్టింది. టెడ్‌కు 2 వేలు పెడితే మమ్మల్ని కేటీఆర్ విమర్శిస్తున్నాడు. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పాం. దొడ్డు వడ్లకు ఇవ్వమని మేము ఎక్కడా చెప్పలేదు.
ఆమె వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లలేకపోతున్నాం
వచ్చే నెల 6,7,8 తేదీల్లో నేను, శ్రీధర్‌బాబు విదేశీ పర్యటనకు వెళుతున్నాం. వివిధ కంపెనీలతో భేటీ అవుతాం. కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలె త్తుకోలేకపోతున్నారు. మేము ఇతర రాష్ట్రాలకు వెళ్లలేకపోతున్నాం. ఎల్బీనగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 14 అంతస్థులకు కుదిస్తాం. మల్లన్న మీద కేసు లు ఉన్నాయి అంటున్న కేటీఆర్..కవిత కేసు గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
జూన్ 5 తర్వాత కేఏ పాల్ గతే
బీజేపీ ఫ్లోర్ లీడర్ అయి నెలరోజులు కాని వ్యక్తి ఆర్టీఐ కింద 70 లెటర్లు పెట్టాడు. ఆయన పేరు చెప్పాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. సీఎం, ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎటువంటి పర్మిష న్ లేకుండానే బీఆర్‌ఎస్ ఆఫీసులు కట్టారు. జూన్ 5 తర్వాత బీఆర్‌ఎస్ నేతలు అంతా కేఏ పాల్‌లా తిరగాల్సిందే. వైఎస్సార్ తరహాలో రేవంత్‌రెడ్డి కూడా ప్రజల కు అందుబాటులో ఉంటున్నారు. రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. బీఆర్‌ఎస్ బాధ్యత కేటీఆర్‌కు ఇస్తే హరీష్‌రావు కొత్త దుకాణం పెట్టే ఆలోచనలో ఉన్నారట. కేసీఆర్ కుటుంబ ఇక బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే బెటర్ అని వ్యాఖ్యానించారు.