Mahanaadu-Logo-PNG-Large

తెలుగు సాహిత్యానికి బుద్ధప్రసాద్‌ కృషి ప్రశంసనీయం

మండలి జన్మదిన వేడుకల్లో గజల్‌ శ్రీనివాస్‌
శ్రీరమణ వ్యాసరమణీయం పుస్తకం అంకితం

అవనిగడ్డ, మహానాడు : తెలుగు సాహిత్యానికి మండలి బుద్ధప్రసాద్‌ కృషి ప్రశంసనీయమని, ఆయన తెలుగు ప్రజల అభిమానధనుడని గజల్‌ మ్యాస్ట్రో గజల్‌ శ్రీనివాస్‌ కొనియా డారు. ఆదివారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ 68వ జన్మదిన వేడుకలు కృష్ణా జిల్లా రచయితల సంఘం, దివిసీమ సాహితీ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సుప్రసిద్ధ సాహితీవేత్త శ్రీరమణ రచించిన వ్యాసరమణీయం పుస్తకాన్ని ఆవిష్కరిం చి కృతిని మండలి బుద్ధప్రసాద్‌కు అంకితమిచ్చారు. విశ్వనాథ సాహిత్య అకాడ మీ దీనిని ప్రచురించింది. ఈ సభలో మండలి బుద్ధప్రసాద్‌తో పాటు గజల్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. తెలుగు సాహిత్యానికి మండలి సేవలను గజల్‌ శ్రీనివాస్‌ ప్రశంసించారు.

వ్యాస రమణీయం అంకితం అదృష్ణం

అనంతరం మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధ సాహితీవేత్త రమణ రచించిన వ్యాస రమణీయం కృతిని తనకు అంకితం ఇవ్వ టం తన అదృష్టమని తెలిపారు. తెలుగు భాష అభివృద్ధికి, సంస్కృతి, సాహిత్య పరిరక్షణకు రాజకీయ పదవుల ద్వారానే కృషి చేసే అవకాశం దక్కిందన్నారు. ఈ ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు తనకు అండగా నిలిచారని, గెలుపు తథ్యమని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. తెలుగు భాష పరి రక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సినీ రచయిత బుర్రా సాయిమాధవ్‌, జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి, ఇండియన్‌ బ్యాంక్‌ రిటైర్డ్‌ ఏజీఎం కొప్పర్తి రాంబాబు, గౌరవ అతిథి వీఐవీఏ, వీవీఐటీ అధ్యక్షుడు వాసిరెడ్డి విద్యాసాగర్‌, విశ్వనాథ సాహిత్య అకాడమీ కార్యదర్శి మోదుగుల రవికృష్ణ, కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జి.వి.పూర్ణచందు పాల్గొన్నారు.